చైనా భారీ రాకెట్‌ ప్రయోగం విఫలం

0
The Long March-5 Y2 rocket takes off from Wenchang Satellite Launch Center in Wenchang, Hainan Province, China July 2, 2017. REUTERS/Stringer

బీజింగ్‌: చైనాకు చెందిన రెండో అత్యంత బరువైన రాకెట్‌ ‘లాంగ్‌ మార్చ్‌–5 వై2’ ప్రయోగం ఆదివారం విఫలమైంది. విమానం నింగికి దూసుకెళ్లిన తర్వాత సాంకేతిక సమస్య ఉత్పన్నమైందనీ, విచారణ జరుపుతున్నామని చైనా పేర్కొంది. ఆదివారం రాత్రి 7.23 గంటలకు (చైనా కాలమానం ప్రకారం) రాకెట్‌ను ప్రయోగించారు. 40 నిమిషాల తర్వాత ప్రయోగం విఫలమైనట్లు ప్రభుత్వ వార్తా సంస్థ జిన్హువా నివేదించింది.

షిజియన్‌–18 అనే ఏడున్నర టన్నుల బరువైన సమాచార ఉపగ్రహాన్ని లాంగ్‌ మార్చ్‌–5 వై2 రాకెట్‌ మోసుకెళ్లింది. లాంగ్‌ మార్చ్‌–5 వరుసలోని రాకెట్లను చైనా 2016 నవంబర్‌ నుంచి వినియోగిస్తోంది. ఈ రాకెట్‌ భూ సమీప కక్ష్య (లోయర్‌ ఎర్త్‌ ఆర్బిట్‌)లోకి అయితే 25 టన్నులు, భూ స్థిర కక్ష్య (జియో స్టేషనరీ ఆర్బిట్‌)లోకి అయితే 14 టన్నుల పే లోడ్‌లను మోసుకెళ్లగలదు.

Comments

comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here