కప్పు కాఫీ కూడా ఇవ్వలేదు

0

తమిళసినిమా:  చిత్ర రంగానికి చెందిన వారి ప్రేమ వివాహాలు చిరకాలం కొనసాగుతాయన్నది అరుదనే చెప్పాలి. అలాంటి వారిలో ఆదర్శ దంపతులుగా ఆనంద జీవితాన్ని గడుపుతున్న జంట సూర్య, జ్యోతిక అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఒక తరంలో సూపర్‌స్టార్‌ రజనీకాంత్, కమలహాసన్‌ల నుంచి శింబు, ధనుష్‌ల వరకూ జత కట్టి ప్రముఖ కథానాయకిగా రాణించిన జ్యోతిక అత్యధిక చిత్రాల్లో జత కట్టింది మాత్రం నటుడు సూర్యతోనే. ఆ పరిచయం వారి మధ్య సాన్నిహిత్యాన్ని, ఆ తరువాత ప్రేమను, ఆపై పెళ్లికి దారి తీసింది. సూర్య, జ్యోతికలకు ఇప్పుడు దియా, దేవ్‌ అనే ఇద్దరు పిల్లలున్న సంగతి తెలిసిందే.

అలా అందమైన జీవితాన్ని అనుభవిస్తున్న జ్యోతిక సుదీర్ఘ విరామం తరువాత 36 వయదినిలే చిత్రం ద్వారా నటిగా రీఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఆ చిత్రం ప్రేక్షకామోదం పొందడంతో తాజాగా మగళీర్‌ మట్టుం చిత్రంతో తెరపైకి రావడానికి రెడీ అవుతున్నారు. ఈ విషయాలు అటుంచితే సూర్య లాంటి మంచి లక్షణాలున్న మగాళ్లు చాలా తక్కువ మంది ఉంటారని జ్యోతిక ఇటీవల ఒక కార్యక్రమంలో పేర్కొన్నారు. ఆయనకు తానింత వరకూ ఒక కప్పు కాఫీ కూడా కలిపివ్వలేదన్నారు. పలాన పని చేయమని సూర్య తనకు చెప్పింది లేదని అన్నారు. సూర్యలో సగం మంచి గుణాలు తన కొడుకు దేవ్‌కు అబ్బినా చాలని జ్యోతిక పేర్కొన్నారు. ఇక సూర్య కూడా జ్యో తనకు భార్యగా లభించడం తన అదృష్టం అని చాలా సార్లు బహిరంగంగానే చెప్పారన్నది గమనార్హం.

Comments

comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here